క్వొశ్చన్ అవర్ రద్దుకు కాంగ్రెస్ నోటీసు | Congress gives notice for suspension of Question Hour in Rajya Sabha | Sakshi
Sakshi News home page

క్వొశ్చన్ అవర్ రద్దుకు కాంగ్రెస్ నోటీసు

Feb 24 2015 10:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసు ఇచ్చింది. రెండోరోజు పార్లమెంట్ బడ్జెట్

న్యూఢిల్లీ : రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసు ఇచ్చింది.  కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రూల్ 267 నిబంధన ప్రకారం ఈ నోటీసు ఇచ్చారు. భూ సేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా రాజ్యసభలో కాంగ్రెస్ ....ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. రైతులకు అన్యాయం చేసే ఆర్డినెన్స్ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ సభలో డిమాండ్ చేయనుంది.

కాగా   రెండోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈరోజు ఉదయం ఇక్కడ సమావేశమైంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలక బిల్లుల ఆమోదం తదితర అంశాలపై చర్చించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement