మూడు నెలలుగా చైనా దేశీయుడి పర్యటన కలకలం | China Tourist Rounding in karnataka For Three Months | Sakshi
Sakshi News home page

మూడు నెలలుగా చైనా దేశీయుడి పర్యటన

Mar 24 2020 8:47 AM | Updated on Mar 24 2020 8:47 AM

China Tourist Rounding in karnataka For Three Months - Sakshi

కర్ణాటక,మైసూరు : చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి మూడు నెలలుగా కారవ్యాన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం కలకలం రేపుతోంది. బ్యాట్రిక్‌ అనే వ్యక్తి సొంత కారవ్యాన్‌లో మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరులో పర్యటించిన బ్యాట్రిక్‌ నగరంలోని గిరిదర్శిని లేఅవుట్, లలితమహల్‌ మైదానంతో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలు, హోటళ్లలో సంచరించాడు. దీంతో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాట్రిక్‌ కరోనా ప్రబలక ముందే తాను భారత్‌కు వచ్చానని అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగరంలోకి ప్రవేశించకుండా కారవ్యాన్‌లో ఉంటున్నానని తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement