చెన్నై చిచ్చరపిడుగుకు గూగుల్ ఇండియా అవార్డు | Sakshi
Sakshi News home page

చెన్నై చిచ్చరపిడుగుకు గూగుల్ ఇండియా అవార్డు

Published Mon, Feb 8 2016 9:40 AM

చెన్నై చిచ్చరపిడుగుకు గూగుల్ ఇండియా అవార్డు - Sakshi

చెన్నై: ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్.. నిర్వహించే ‘కోడ్ టు లెర్న్ కాంటెస్ట్’లో చెన్నైకి చెందిన శ్రీకృష్ణ మధుసూదనన్ విజేతగా నిలిచాడు. భారత్‌లో కంప్యూటర్ సైన్స్‌ను మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతో గూగుల్ సంస్థ ‘కోడ్ టు లెర్న్ కాంటెస్ట్’ పేరుతో ప్రతి సంవత్సరం ఈ పోటీని నిర్వహిస్తోంది. భారత దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గూగుల్ ఈ అవార్డును ప్రారంభించింది.

గత ఏడాది నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో పెరంగుడిలోని బీవీఎం గ్లోబల్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న శ్రీకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అవార్డును దక్కించుకున్నాడు. తన బిడ్డకు అవార్డు రావడం గురించి శ్రీకృష్ణ తల్లి శాంతి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే కంప్యూటర్ అంటే ఆసక్తి కనబర్చేవాడని, బీవీఎం పాఠశాలలో నిర్వహిస్తున్న రోబోటిక్ సైన్స్ తరగతులు ఉపయోగపడ్డాయన్నారు.
 

Advertisement
Advertisement