పిట్ట కొంచం.. కూత ఘనం.. | boy explains cyber crime in ground zero meeting | Sakshi
Sakshi News home page

పిట్ట కొంచం.. కూత ఘనం..

Nov 15 2014 1:19 AM | Updated on Sep 2 2017 4:28 PM

పిట్ట కొంచం.. కూత ఘనం..

పిట్ట కొంచం.. కూత ఘనం..

పట్టుమని పదేళ్లైనా నిండకుండానే సైబర్ ప్రపంచం మెలకువలను ఔపోశన.....

న్యూఢిల్లీ: పట్టుమని పదేళ్లైనా నిండకుండానే సైబర్ ప్రపంచం మెలకువలను ఔపోశన పట్టి శభాష్ అనిపించుకుంటున్నాడు ప్రవాస భారతీయ బాలుడు రూబెన్ పాల్. సైబర్ సెక్యూరిటీపై శుక్రవారం జరిగిన గ్రౌండ్ జీరో సదస్సులో..  ఇంటర్నెట్ నేరాల గురించి విపులంగా వివరించి అందర్నీ ఆకట్టుకున్నాడీ ఎనిమిదేళ్ల బుడతడు. వెబ్‌సైట్లకు సంబంధించి ఫేక్ లింక్‌ల ద్వారా క్రిమినల్స్ ఏ విధం గా మోసాలకు పాల్పడతారన్నది సోదాహరణంగా తెలియజేశాడు పాల్.

సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా నెటిజన్లను మభ్యపెట్టి, వారి సిస్టమ్‌ను తమ అధీనంలోకి తీసుకుంటారన్నది ఒక వెబ్‌పేజీని క్లోనింగ్ చేసి మరీ వివరించాడు. అలాగే, ఇంటర్నెట్  వాడకంవిషయంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచితులతో అప్రమత్తంగా ఉండటం మొదలైన అంశాల గురించీ వివరించాడు. అమెరి కాలో నివసించే పాల్.. తన తండ్రి మనో పాల్ ప్రోద్బలంతో ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాల గురించి నేర్చుకున్నాడు. ఇటీవలే ప్రూడెంట్ గేమ్స్ పేరిట సొంతంగా గేమింగ్ సంస్థను కూడా ప్రారంభించాడు. దానికి అతనే సీఈవో.

Advertisement

పోల్

Advertisement