కారు కంటే బోటే నయం | boats better than cars in chennai now | Sakshi
Sakshi News home page

కారు కంటే బోటే నయం

Dec 2 2015 11:58 AM | Updated on Sep 3 2017 1:23 PM

కారు కంటే బోటే నయం

కారు కంటే బోటే నయం

సాధారణంగా సిటీలో అటూ ఇటూ తిరగాలంటే కారు చేతిలో ఉండాలని అనుకుంటాం. సిటీబస్సుల్లో తిరగలేక.. బైకులయితే కాలుష్యం భరించలేక నానా ఇబ్బందులు పడుతుంటారు.

సాధారణంగా సిటీలో అటూ ఇటూ తిరగాలంటే కారు చేతిలో ఉండాలని అనుకుంటాం. సిటీబస్సుల్లో తిరగలేక.. బైకులయితే కాలుష్యం భరించలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే సొంత కారులో అయితే ఎంచక్కా వెళ్లొచ్చని భావిస్తారు. కానీ, ప్రస్తుతం చెన్నై నగరంలో పరిస్థితి తిరగబడింది. ఎక్కడికక్కడ పార్కింగ్ చేసిన కార్లు కూడా మునిగిపోతున్నాయి. దాంతో జనం మొత్తం పడవల్లోనే తిరుగుతున్నారు.

బోటులో వెళ్తున్న వాళ్లకు పక్కనే కారు పూర్తిగా మునిగిపోయి కనిపిస్తుంటే, దాన్ని దాటుకుంటూ ఆ పక్క నుంచే పడవలో వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో కూడా చెన్నైలో భారీ వర్షాలు కురిసిన సమయంలో ఓలా క్యాబ్స్ లాంటి సంస్థలు క్యాబ్‌లకు బదులు పడవలను నడిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనం కూడా ఇలాంటి సీజన్లో చేతిలో కారుకు బదులు మంచి మోటారు బోటు ఉంటే బాగుండునని భావిస్తున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement