'అలాంటప్పుడు కుక్కనే పెళ్లి చేసుకో' | Bengaluru woman turned down a guy marriage proposal | Sakshi
Sakshi News home page

'అలాంటప్పుడు కుక్కనే పెళ్లి చేసుకో'

Sep 14 2016 11:15 AM | Updated on Sep 29 2018 4:26 PM

'అలాంటప్పుడు కుక్కనే పెళ్లి చేసుకో' - Sakshi

'అలాంటప్పుడు కుక్కనే పెళ్లి చేసుకో'

తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను వద్దన్నాడని ఓ యువతి తన పెళ్లిని రద్దు చేసుకుంది.

బెంగళూరు: తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను వద్దన్నాడని ఓ యువతి తన పెళ్లిని రద్దు చేసుకుంది. తన కుక్కకు తానొక్కదాన్నే తోడని, దానికి దూరం చేయాలని చూసే ఏది తనకు వద్దని తెగేసి చెప్పి మూగజీవాలపై తనకు ఉన్న అప్యాయతను చాటుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ అయింది. బెంగళూరుకు చెందిన కరిష్మా వాలియా అనే యువతి గుర్గావ్ లోని డిలైట్ ఇండియా సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు ఇటీవల పెళ్లి సంబంధం వచ్చింది.

అబ్బాయి కూడా మంచి అందగాడే. మంచి హోదాలోనే ఉన్నాడు. తల్లి దండ్రుల బలవంతంలో పెళ్లికి తొలుత ఒప్పుకుంది. అలా వారిద్దరి మధ్య పెళ్లికి ముందు వాట్సాప్ సంభాషణలో కుక్కల విషయం చర్చకు వచ్చింది. కరిష్మాకు కుక్కలంటే ఎంత ఇష్టమో అతడికి అంత కష్టం. అబ్బాయి కుటుంబానికి కూడా కుక్కలంటే ఇష్టం ఉండదట. అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు.

దీంతో ఆమె ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తనకు అతడితో సెట్టవదని, పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో అవాక్కయినా అబ్బాయి నువ్వు నిజంగా సీరియస్ గానే చెప్తున్నావా అని ప్రశ్నించాడు. అయినప్పటికీ ఆమె తెగేసి చెప్పడంతో చిర్రెత్తిపోయిన ఆ కుర్రాడు 'ఇలా అంటున్నందుకు క్షమించు.. అలాంటప్పుడు ఆ కుక్కను పెళ్లి చేసుకో' అని  మరో మెస్సేజ్ పెట్టాడు. అలా వారిద్దరి మధ్య మొదలవ్వాల్సిన వివాహ బంధం ఆదిలోనే ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement