
రూ. 2 లక్షలు.. 20 ఎలుకలు..!
గ్రేటర్ బెంగళూరు సిటీ కార్పొరేషన్ (జీబీసీసీ) గత రెండేళ్లలో ఎలుకలను పట్టుకోవడానికి ఖర్చు చేసిన మొత్తం రూ. 2 లక్షలట. అంటే ఒక్కో ఎలుకకూ పది వేల ఖర్చన్న మాట. ఆశ్చర్యంగా ఉన్నా
ఒక్కో ఎలుకను పట్టడానికి పది వేలు
బెంగళూరు సిటీ కార్పొరేషన్ లీల
బెంగళూరు: గ్రేటర్ బెంగళూరు సిటీ కార్పొరేషన్ (జీబీసీసీ) గత రెండేళ్లలో ఎలుకలను పట్టుకోవడానికి ఖర్చు చేసిన మొత్తం రూ. 2 లక్షలట. అంటే ఒక్కో ఎలుకకూ పది వేల ఖర్చన్న మాట. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. సమాచార హక్కు(ఆర్‌టీఐ) దరఖాస్తు ద్వారా వెల్లడైన వాస్తవం. అధికార బీజేపీ కౌన్సిలర్ ఎన్‌ఆర్ రమేశ్ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా జీబీసీసీ అధికారుల అవినీతి లీలలను వెలుగులోకి తెచ్చారు. ఆర్‌టీఐ దరఖాస్తు ప్రకారం..
కార్పొరేషన్ కార్యాలయాల్లోని ఫైళ్లను ఎలుకల నుంచి రక్షించేందుకు మూడు పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. అయితే రెండేళ్ల కాలంలో ఈ ఏజెన్సీలు పట్టుకున్న ఎలుకలు 20. అంటే ఒక్కో ఎలుకను పట్టుకునేందుకు ఖర్చు రూ. పది వేలు. ‘‘మార్కెట్‌లో ఎలుకల మందు ధర రూ. 20 మించిలేదు. ఇటువంటి పరిస్థితుల్లో 20 ఎలుకలను పట్టేందుకు మూడు ఏజెన్సీల సేవలు వినియోగించడంలో లాజిక్ ఏమిటి? దీనిపై అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు’’ అని రమేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మాజీ కౌన్సిలర్ ఎం. నారాయణ స్పందిస్తూ.. 20 ఎలుకలను పట్టుకునేందుకు 2 లక్షలు ఖర్చు పెట్టడం దారుణమన్నారు.