అశోక్ చవాన్‌కు ఈసీ నోటీసు | Ashok Chavan gets EC notice in 'paid news' case | Sakshi
Sakshi News home page

అశోక్ చవాన్‌కు ఈసీ నోటీసు

Jul 14 2014 1:55 AM | Updated on Oct 8 2018 5:45 PM

అశోక్ చవాన్‌కు  ఈసీ నోటీసు - Sakshi

అశోక్ చవాన్‌కు ఈసీ నోటీసు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చిక్కుల్లో పడ్డారు. చెల్లింపు వార్తల వ్యవహారంలో ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చిక్కుల్లో పడ్డారు. చెల్లింపు వార్తల వ్యవహారంలో ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. జవాబిచ్చేందుకు 20 రోజుల గడువిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు అనుగుణంగా తన ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంది. ఆయనపై అనర్హత వేటు ఎందుకు వేయరాదో చెప్పాలంది. 2009లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చవాన్ సీఎంగా ఘనతలను ప్రస్తావిస్తూ వార్తాపత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.

ఇవి చెల్లింపు వార్తల కింద పరిగణించి ఇందుకైన మొత్తాన్ని ఆయన ఎన్నికల వ్యయంలో కలపాలన్న ఫిర్యాదుకు సంబంధించి చవాన్ ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఒకవేళ ఈసీ కనుక చవాన్‌పై అనర్హత వేటు వేస్తే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశముంది. కాగా, చెల్లింపు వార్తలకు మీడియా జాగ్రత్తగా ఉండాలని ఈసీ హెచ్చరించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement