‘అలా అయితే ఐదేళ్లూ ఒకే సీఎం’ | AIADMK MLAs disqualified: Chidambaram accuses Tamil Nadu Speaker of helping Palaniswamy govt get majority | Sakshi
Sakshi News home page

‘అలా అయితే ఐదేళ్లూ ఒకే సీఎం’

Sep 19 2017 1:20 PM | Updated on Sep 19 2017 4:46 PM

‘అలా అయితే ఐదేళ్లూ ఒకే సీఎం’

‘అలా అయితే ఐదేళ్లూ ఒకే సీఎం’

దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్‌ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్రంగా తప్పుపట్టారు.

సాక్షి,న్యూఢిల్లీః దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్‌ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్రంగా తప్పుపట్టారు.పళనిస్వామి సర్కార్‌ను కాపాడేందుకు స్పీకర్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు. మునిగే పడవను ఏ ఒక్కరూ కాపాడలేరని ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు.
 
తమిళనాడు స్పీకర్‌ నిర్ణయం సరైనదే అయితే ఎన్నికైన ఏ పార్టీ శాసనసభా పక్ష నేతను అసమ్మతి ఎమ్మెల్యేలు మార్చే అవకాశం ఉండదు కదా అని ప్రశ్నించారు. స్పీకర్‌ నిర్ణయం ప్రకారం ఒకసారి సీఎంగా ఎన్నికైన వారు ఐదేళ్ల పాటు కొనసాగుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ధన్‌పాల్‌ నిర్ణయం మోసపూరిత చర్యగా చిదంబరం అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement