
ఎల్‌కే అడ్వాణీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో నిర్ణయించుకోవాలని బీజేపీ కురువృద్ధ నేతలు ఎల్‌కే అడ్వాణీ (91), మురళీ మనోహర్ జోషి (84)లను బీజేపీ కోరింది. 75 ఏళ్లు దాటిన వారికి పదవి దక్కదని చెబుతూనే.. పోటీ చేయాలా వద్దా అనేది వారి ఇష్టమని బీజేపీ పేర్కొన్నట్లు సమాచారం. ‘75 ఏళ్ల వయసు దాటిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే నిషేధం విధించాం. కానీ పోటీ చేసే విషయంలో ఎలాంటి నిషేధం లేదు’ అని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు.