ప్రైవేటు పాఠశాలల్లో మేనేజ్ మెంట్ కోటా అడ్మిషన్లను రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: ప్రైవేటు పాఠశాలల్లో మేనేజ్ మెంట్ కోటా అడ్మిషన్లను రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకే మేనేజ్ మెంట్ కోటాను రద్దు చేసినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పేదపిల్లలకు 25 శాతం సీట్లను కేటాయింపు యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు.
ఢిల్లీలో ప్రైవేటు పాఠశాలలు విపరీతంగా ఫీజులు పెంచేస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.