జన్‌ధన్ యోజన స్కీమ్ విజయవంతం అయినట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరంభించిన జన్‌ధన్ యోజన స్కీమ్ విజయవంతం అయినట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మూడేళ్లలో ఈ స్కీమ్ కింద 30 కోట్ల కుటుంబాలు కొత్తగా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాయని ఆయన బుధవారం ప్రకటించారు.
జన్‌ధన్‌యోజన కార్యక్రమం ఆరంభించకముందు.. దేశంలో దాదాపు 42 శాతం కుటుంబాలు బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో 99.99 శాతం కుటుంబాలు ఒదోఒక బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.