8వ క్లాసు కుర్రాడు.. రోబో తయారుచేశాడు! | 13-year-old Chandigarh boy builds robot | Sakshi
Sakshi News home page

8వ క్లాసు కుర్రాడు.. రోబో తయారుచేశాడు!

Jun 10 2016 7:36 PM | Updated on Sep 4 2017 2:10 AM

సెల్‌ఫోన్లతో నియంత్రించగల రోబోను 13 ఏళ్ల కుర్రాడు తయారుచేశాడు.

సెల్‌ఫోన్లతో నియంత్రించగల రోబోను 13 ఏళ్ల కుర్రాడు తయారుచేశాడు. డీటీఎంఎఫ్ (డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ) సాయంతో ఇది పనిచేస్తుంది. ఇందుకోసం తాను రెండు ఫోన్లు ఉపయోగించానని, వాటిలో ఒకటి రో బోకు కనెక్ట్ అయి ఉంటుందని, అది కాల్ రిసీవర్‌గా పనిచేస్తుందని రోబోను తయారుచేసిన తుషార్ సరీన్ చెప్పాడు. అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

తాను తయారుచేసిన రోబోను శుక్రవారం మీడియా సమావేశంలో ప్రదర్శించాడు. తాను మరో రెండు మోడళ్ల మీద కూడా పనిచేస్తున్నానని, అవి ప్రాక్టికల్‌గా కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పాడు. ప్రస్తుతం తాను ఫైర్ అలారం, స్మోక్ సెన్సర్‌లను కూడా తయారుచేస్తున్నానని, వాటిని బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని తుషార్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement