న్యూఢిల్లీ: లోక్‌సభ వ్యవహారాలను సజావుగా నడిపేలా స్పీకర్‌కు సహకారం అందించేందుకు 10 మంది చైర్‌పర్సన్‌లను స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంపిక చేశారు.
కమిటీని ప్రకటించిన స్పీకర్ సుమిత్ర మహాజన్
టీడీపీ నుంచి కే నారాయణకు అవకాశం
న్యూఢిల్లీ: లోక్‌సభ వ్యవహారాలను సజావుగా నడిపేలా స్పీకర్‌కు సహకారం అందించేందుకు 10 మంది చైర్‌పర్సన్‌లను స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంపిక చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగకపోవచ్చని స్పీకర్ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కొనకళ్ల నారాయణ సహా 10 మంది చైర్‌పర్సన్‌లతో ఒక కమిటీని ఆమె సోమవారం ప్రకటించారు.
చైర్‌పర్సన్‌లుగా ఎంపికైన వారిలో బీజేపీకి చెందిన హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్, ప్రహ్లాద్ జోషీ, హుకుమ్ సింగ్, రామణ్ దేకలతో పాటు అర్జున్ చరణ్ సేథీ(బీజేడీ),తంబిదురై(అన్నాడీఎంకే), కేవీ థామస్(కాంగ్రెస్), ఆనంద్‌రావు అద్సుల్(ఎస్‌ఎస్), రత్న డే(తృణమూల్) ఉన్నారు.