
= అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డిమాండు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మిని అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భాస్కరరావు డిమాండు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ఫొటోలతో పాటు ఆయన పోస్టు చేశారు. హావేరి మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నాగలక్ష్మి చౌదరి ఆ స్టేషన్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీటులో కూర్చోవడం ఆమె అధికార దుర్వినియోగాన్ని ప్రదర్శిస్తోందన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఇలా కూర్చునే అధికారం ఆ శాఖపై అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందన్నారు.
అలాంటిది మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నాగలక్ష్మికి ఆ సీట్లో కూర్చునే అర్హత లేదని, ఇది ఆమె అజ్ఞానాన్ని సూచిస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణం ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని ఆయన డిమాండు చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు.
Chairperson of Women’s Commission May have civil court powers but she has no propriety to sit on a Sub Insp chair in a police station. Under erstwhile CrPC sec 36 only the Supervisory Officer of the Department can sit there or Minister or CM as they are government. In a display… pic.twitter.com/xIJRYNzoQ5
— Bhaskar Rao (@Nimmabhaskar22) August 29, 2025