రాజన్నను గుర్తు చేసిన మమ్ముట్టి! | Yatra Movie Success Celebration In Nellore | Sakshi
Sakshi News home page

థియేటర్ల వద్ద ‘యాత్ర’ సంబరాలు

Feb 8 2019 5:02 PM | Updated on Feb 8 2019 5:03 PM

Yatra Movie Success Celebration In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : కావలిలోని లత థియేటర్ లో యాత్ర సినిమా విడుదల సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎంపీ మేకపాటి  రాజమోహన్‌రెడ్డి కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి రామకోటా రెడ్డి, జగదీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడం ఆనందంగా ఉందని ఎంపీ మేకపాటి అన్నారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. వై.ఎస్.ఆర్ పాలనతో ప్రజలను మెప్పించారని.. వైఎస్సార్‌పై సినిమా అంటేనే ప్రజలంతా ఆసక్తిని కనబరిచారని, ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పాదయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుని చరిత్ర సృష్టించారని కొనియాడారు. యాత్ర సినిమాలో మమ్ముట్టి బాగా నటించారని అన్నారు. నెల్లూరు అర్బన్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అభిమానుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సందడి చేశారు. యాత్ర పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతూ ఉండటంతో.. వైఎస్సార్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement