
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇప్పటికే పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టారు. ఇక, తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.
వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తాజాగా మాజీమంత్రి అనిల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, కొవ్వూరులో వైఎస్సార్‌సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్‌పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు గానూ.. ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు.. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కాగా, ఎల్లుండి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ప్రజలు విస్తుపోతున్నారు.
