ప్రభాస్‌ 'సాహో' రిలీజ్‌ డేట్‌ ఇదేనట! | When  Prabhas Saaho is releasing | Sakshi
Sakshi News home page

Dec 7 2017 1:39 PM | Updated on Dec 7 2017 1:55 PM

When  Prabhas Saaho is releasing - Sakshi

'బాహుబలి' సినిమాల తర్వాత ప్రభాస్‌ చేస్తున్న తాజా సినిమా 'సాహో'.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలు దేశంలో ఎంత పెద్ద విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాల అనంతరం ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో' దేశవ్యాప్తంగా క్రేజ్‌ నెలకొంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటిలోనూ ఈ సినిమాపై చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఉన్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రనిర్మాతలు భావిస్తున్నారట. రానున్న దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రయూనిట్‌ శ్రమిస్తోందని, అయితే, వీఎఫ్‌ఎక్స్‌ మిక్సింగ్‌ కోసం కొంచెం ఎక్కువ సమయం పడితే.. 2019లో ఈ సినిమా వచ్చే అవకాశముంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ట్రాన్స్‌ఫార్మర్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలుకు పనిచేసిన కేన్నీ బేట్స్‌ నేతృత్వంలో కళ్లుచెదిరేరీతిలో స్టంట్‌ సీక్వెన్స్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement