Yatra Movie: The Voice of Yatra, Mammooty's Dubbing Video for YSR Biopic - Sakshi
Sakshi News home page

Jan 19 2019 11:52 AM | Updated on Jan 19 2019 12:16 PM

The Voice of Yatra Mammootty Dubbing Making YSR Biopic - Sakshi

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బయోపిక్‌ మూవీ యాత్ర. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌, ట్రైలర్‌లతో ఆకట్టుకున్నారు. తాజాగా వాయిస్‌ ఆఫ్‌ యాత్ర పేరుతో మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

హీరో మమ్ముట్టి ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భాష రాకపోయినా.. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నారు. శివా మేక సమర్పణలో 70 ఎమ్ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్‌, సచిన్‌ ఖేడ్కర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement