'ఆ సినిమాకు ఆస్కార్ ఖాయం'

'ఆ సినిమాకు ఆస్కార్ ఖాయం'


లాస్ ఏంజెలెస్: 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' 8వ సీక్వెల్ కు ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందని హీరో విన్ డీజిల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఎఫ్. గ్యారీ గ్రేకు వచ్చే సంవత్సరం ఆస్కార్ అవార్డు ఖాయమని అభిప్రాయపడ్డాడు. 'ఈ సినిమా మొత్తాన్ని గ్యారీ తన భుజాలపై వేసుకున్నాడు. ఇందులో నేను కూడా నా వంతు పాత్ర పోషిస్తున్నాను. గ్యారీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది. అతడికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. ఏంజరుగుతుందో వేచి చూద్దామ'ని విన్ డీజిల్ పేర్కొన్నాడు.'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' 8వ సీక్వెల్ లో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెప్పాడు. అంతకుముందు సినిమాతో పోలిస్తే తన పాత్ర సంక్లిష్టంగా ఉంటుందని, అందరినీ ఆశ్చర్య పరిచేలా ఎమోషన్స్ ఉంటాయని వెల్లడించాడు. అమెరికాలో ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది.  బాలీవుడ్ నటి దీపికా పదుకొణేతో కలిసి విన్ డీజిల్ నటించిన 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top