కామెడీ హీరో కోసం బాహుబలి రైటర్‌

Writer Vijayendra prasad - Sakshi

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ త్వరలో ఓ కామెడీ హీరో సినిమాకు కథ అందించనున్నారట. బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్ లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్‌ తెలుగుతో పాటు పరభాషా చిత్రాలకు కూడా కథ అందిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ కామెడీ స్టార్‌ సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఆయన కథ అందించనున్నారట. ఈ సినిమాకు స‍్వర్ణ సుబ్బారావ్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top