రాజకీయాలంటే చిరాకు

vijay devarakonda nota first look release - Sakshi

నాకు రాజకీయాలంటే చిరాకు. కానీ, ఒకవేళ నేనే రాజకీయాలు చేయదలచుకుంటే ఇలానే చేస్తాను అంటున్నారు విజయ్‌ దేవరకొండ. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన  లేటెస్ట్‌ సినిమా ‘నోటా’. మెహరీన్‌ కథానాయిక. తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో రూపొందింది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమా నిర్మించారు. పాలిటిక్స్‌లో తిరుగుబాటు చేసిన ఓ యంగ్‌ పొలిటీషియన్‌గా ఈ చిత్రం కథ ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని సోమవారం రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ను ఈనెల 6న రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. నాజర్, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌.సి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top