కాశీ ఏం చేశాడు? | Vijay Antony's `Kaali` to release on May 18 | Sakshi
Sakshi News home page

కాశీ ఏం చేశాడు?

May 12 2018 2:02 AM | Updated on May 12 2018 2:02 AM

Vijay Antony's `Kaali` to release on May 18 - Sakshi

విజయ్‌ ఆంటోని, సునైన

నటుడిగా, సంగీత దర్శకుడిగా తమిళంలో, తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకున్నారు విజయ్‌ ఆంటోని. సెన్సిబుల్‌ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘కాశి’. అంజలి, సునైన కథానాయికలు. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఈ నెల 18న విడుదలవుతోంది. లెజండ్‌ సినిమా పతాకంపై ఉదయ్‌ హర్ష వడ్డెల, గణేష్‌ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కాశీ ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడగా, ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాం. తమిళంలో ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్‌ చేస్తామన్నది చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, కెమెరా: రిచర్డ్‌ ఎం. నాథన్‌.

Advertisement
 
Advertisement
Advertisement