ఆసక్తికరంగా ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్‌

Veera Bhoga Vasantha Rayalu Trailer Released - Sakshi

కెరీర్‌ మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. సక్సెస్‌ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నారా రోహిత్‌. కథా బలం ఉన్న సినిమాలే చేస్తూ.. విజయం సాధిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. సమ్మోహనంతో ఇటీవలె కూల్‌ హిట్‌ కొట్టాడు సుధీర్‌ బాబు. ప్రస్తుతం వీరంతా కలిసి చేస్తున్న సినిమానే ‘వీర భోగ వసంత రాయలు’

ఉత్కంఠ రేపే కథనంతో తెరకెక్కినట్లు కనిపిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నారా రోహిత్‌ డైలాగ్‌లతో సాగిన ఈ టీజర్‌లో.. సస్పెన్స్‌ను కంటిన్యూ చేసేలా కట్‌ చేయడం బాగుంది. చివర్లో గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చేది ఎవరో రివీల్‌ చేయకుండా.. అసలు కథపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ మూవీలో శ్రియా కీలకపాత్రలో నటిస్తోంది.  అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమాకు  ఆర్‌. ఇంద్రసేన్‌ దర్శకత్వం వహించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top