మామ అల్లుళ్ల మల్టీ స్టారర్

Naga Chaitanya Venkatesh

సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన మూడో సినిమాను కూడా అక్కినేని కాంపౌండ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. అయితే తన మూడో సినిమాను మల్టీ స్టారర్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. కళ్యాణ్ తదుపరి చిత్రం వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్ లో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో అతిథి పాత్రలో అలరించిన వెంకీ, ఈ సారి పూర్తి స్థాయి మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి వెంకటేష్ ఏ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టకపోయినా.. త్వరలోనే ఓ రీమేక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది. నాగచైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మల్టీ స్టారర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top