ప్రభాస్‌ సినిమా కోసం లుక్‌ టెస్ట్‌..!

UV Creations Does Photo Shoot On Pooja Hegde - Sakshi

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరగుతోంది. అయితే సాహో సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాను స్టార్ట్‌ చేసే ప్లాన్‌ లో ఉన్నాడు ప్రభాస్‌. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు ఇప్పటికే ఓకె చెప్పాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం పూజా హెగ్డేకు లుక్‌ టెస్ట్ నిర్వహించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పూజ బాగా సన్నబడటంతో ప్రభాస్‌ సరసన లుక్‌ ఎలా ఉంటుందో అన్న అనుమానంతో ఫొటోషూట్ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ షూట్‌కు సంబంధంచి యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ జ్యోతిష్యుడిగా కనిపించనున్నాడన్న టాక్‌ కూడా వినిపిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top