నటితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన; అరెస్ట్‌ | Uber Driver Arrested for Disorderly Conduct | Sakshi
Sakshi News home page

నటితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన; అరెస్ట్‌

Jul 11 2019 1:52 PM | Updated on Jul 11 2019 2:15 PM

Uber Driver Arrested for Disorderly Conduct - Sakshi

స్వస్తికా దత్త (ఫైల్‌)

కోల్‌కతా: ప్రముఖ బెంగాల్‌ టీవీ సీరియల్‌ నటి స్వస్తికా దత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్‌ డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. సీరియల్‌ షూటింగ్‌కు వెళ్లడానికి బుధవారం ఉదయం స్వస్తికాదత్త ఉబెర్‌ క్యాబ్‌ను బుక్‌ చేశారు. కారులో షూటింగ్‌ స్పాట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ బుకింగ్‌ను క్యాన్సిల్‌ చేసి, ఆమెను బయటికి లాగాలని ప్రయత్నించాడు. స్వస్తికా దత్త ప్రతిఘటించడంతో కారులోనే మరో చోటికి తీసుకెళ్లడానికి యత్నించి, ఫోన్‌లో తన ఫ్రెండ్స్‌ని కూడా రమ్మన్నాడు. దీంతో బెదిరిపోయిన నటి కారుదిగి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్‌ కారుతో సహా పారిపోయాడు. ఇదంతా కేవలం అరగంట వ్యవధిలో జరిగిందని స్వస్తికా దత్త సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కారు నెంబర్‌, డ్రైవర్‌ పేరుతో సహా వివరాలను షేర్‌ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు డ్రైవర్‌ని అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement