అందుకే నీకు ఈ గిఫ్ట్‌ ఇస్తున్నా: నటుడు

Tom Hanks Gifts Typewriter To Bullied Boy Named Corona - Sakshi

చిన్నారి ఫ్యాన్‌కు టామ్‌ హాంక్స్‌ అరుదైన గిఫ్ట్‌!

కరోనా పేరు వినపడితేనే చాలు ప్రపంచమంతా వణికిపోతోంది. మహమ్మారి ఎక్కడి నుంచి ఎవరికి సోకుతుందోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పేరిట ఉన్న బ్రాండ్లు, భవనాలు, మనుషులను కొంతమంది ఆకతాయిలు తులనాడుతున్నారు. వెకిలిగా కామెంట్లు చేస్తూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన ఎనిమిదేళ్ల పిల్లాడు కరోనా డీ వెరీస్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ క్రమంలో తన బాధను వెల్లడిస్తూ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ హాంక్స్‌ అతడు లేఖ రాశాడు.(కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!)

‘‘మీకు, మీ భార్యకు కరోనా సోకిందని విన్నాను. ఇప్పుడు మీరెలా ఉన్నారు. నా పేరు అంటే నాకెంతో ఇష్టం. కానీ స్కూళ్లో అందరూ నన్ను కరోనా వైరస్‌ అని పిలుస్తున్నారు. నాకు ఏడుపొస్తోంది. వాళ్లపై కోపం కూడా వస్తోంది’’అని టామ్‌ హాంక్స్‌తో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన హాలీవుడ్‌ లెజెండ్‌ టామ్‌.. ‘‘నీ లేఖ నన్ను, నా భార్యను ఎంతో ఆశ్చర్యపరిచింది. నన్ను స్నేహితుడిలా భావించినందు వల్లే కదా నువ్విలా చేశావు’’అంటూ సదరు పిల్లాడికి కరోనా బ్రాండ్‌ టైప్‌రైటర్‌ను బహుమతిగా ఇచ్చారు. ‘‘నువ్వు నాకు మళ్లీ లేఖ రాస్తావు కదా. అందుకే ఈ గిఫ్ట్‌’’ అని పేర్కొన్నారు. (హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ )

కాగా హాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌  టామ్‌ హాంక్స్‌(63), రీటా విల్సన్‌(63) ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న వీరు ప్రస్తుతం అమెరికాకు చేరుకున్నారు. కాగా కాలిఫోర్నియాలో జన్మించిన టామ్‌ స్ప్లాష్‌, బ్యాచిలర్‌ పార్టీ, బిగ్‌, ఫారెస్ట్‌ గంప్‌, ది టెర్మిమినల్‌, అపోలో 13 తదితర చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. మొదటి భార్య సమంతా లూయీస్‌ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top