జూలైలో బాక్సాఫీస్‌ వెలవెల

Tollywood Box Office Review In July - Sakshi

సమ్మర్‌లో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ రికార్డులు వేడెక్కాయి. రంగస్థలం, భరత్‌ నేను, మహానటి లాంటి సినిమాలతో రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. ఆ తరువాత సమ్మోహనం సినిమా ఆ ఊపును కంటిన్యూ చేసింది. సమ్మర్‌లో థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. ప్రథమార్దం టాలీవుడ్‌కు మరిచిపోలేని హిట్‌లు వచ్చాయి. ప్రథమార్దంలో క్రియేట్‌ అయిన బాక్సాఫీస్‌ రికార్డులు ఇప్పట్లో చెరిగిపోయేలా లేవు. 

ద్వితీయార్దాన్ని ఎంతో ఆశగా మొదలుపెట్టినా.. జూలై మాసం మాత్రం టాలీవుడ్‌కు అంతగా కలిసిరాలేదు. మొదటి వారం రిలీజైన పంతం, తేజ్‌ ఐ లవ్‌ యూ చతికిలబడ్డాయి. ఇక రెండోవారం విజేత, ఆర్‌ఎక్స్‌ 100, చినబాబు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కాస్త డిఫరెంట్‌గా, బోల్డ్‌ కంటెంట్‌తో వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100ను మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు.

యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమా భారీ ఓపెనింగ్స్‌తో మొదలై.. మంచి కలెక్షన్లను సాధించింది. మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ ‘విజేత’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో  నటించిన మురళీ శర్మకు ప్రశంసలు దక్కాయి కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. కార్తీ హీరోగా వచ్చిన ‘చినబాబు’ సినిమా ఎప్పటిలాగే తమిళ నేటివిటీ ఎక్కువయ్యే సరికి తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ​ 

మూడోవారంలో వచ్చిన ఆటగదరా శివ, వైఫ్‌ ఆఫ్‌ రామ్‌, లవర్‌, పరిచయం సినిమాల్లో ... మంచు లక్ష్మి ప్రధాన ప్రాతలో వచ్చిన ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఆ నలుగురు ఫేమ్‌ డైరెక్టర్‌ చంద్ర సిద్దార్థ తెరకెక్కించిన ‘ఆటగదరా శివ’కు మంచి టాక్‌ దక్కినా... కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఇక ఎప్పటిలాగానే రాజ్‌తరుణ్‌ ‘లవర్‌’ సినిమాతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ప్రమోషన్స్‌లో చెప్పినంత విషయం సినిమాలో లేకపోయే సరికి ‘పరిచయం’ ఆకట్టుకోలేకపోయింది.

జూలై చివరి వారంలో సాక్ష్యం, హ్యాపి వెడ్డింగ్‌, పెదవి దాటని మాటొకటుంది, మోహిని సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో సాక్ష్యం, హ్యాపి వెడ్డింగ్‌కు ప్రమోషన్స్‌ భారీ స్థాయిలో చేశారు. పంచ భూతాల కాన్సెప్ట్‌తో వచ్చిన ‘సాక్ష్యం’..  రొటీన్‌ కథా, కథనాలతో వచ్చినా.. బెల్లంకొండ శ్రీనివాస్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సాక్ష్యం నిలబడింది. మెగా డాటర్‌ నిహారిక ‘హ్యాపి వెడ్డింగ్‌’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. ఇక త్రిష లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ‘మోహిని’, పెదవి దాటని మాటకటుంది ప్రేక్షకులను థియేటర్స్‌ వైపు రప్పించలేకపోయాయి. ఇక ఆగస్ట్‌లో రిలీజయ్యే గూఢాచారి, శైలజా రెడ్డి అల్లుడు, గీతా గోవిందం, శ్రీనివాస కళ్యాణం, ఆటగాళ్లు, నర్తనశాల లాంటి సినిమాలతో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దాహం తీరుతుందో లేదో చూడాలి. 

- బండ కళ్యాణ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top