
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది.
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కారు రోడ్డు పక్కన ఉన్న ప్రహారీ గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
యాక్సిడెంట్ అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కారును రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్‌లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో రాజ్‌తరుణ్ నటిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం నటుడు తరుణ్ కారుకు జరిగినట్టు వార్తలు రావడంతో ఆయన ఖండించారు.