ఏసు పుట్టిన దేశంలో... | Tolikiranam movie | Sakshi
Sakshi News home page

ఏసు పుట్టిన దేశంలో...

May 21 2016 11:33 PM | Updated on Sep 4 2017 12:37 AM

ఏసు పుట్టిన దేశంలో...

ఏసు పుట్టిన దేశంలో...

ఇప్పటి వరకూ యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా చాలా చిత్రాలొచ్చాయి. తాజాగా పీడీ రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో

 ఇప్పటి వరకూ యేసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా చాలా చిత్రాలొచ్చాయి. తాజాగా పీడీ రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తోన్న చిత్రం ‘తొలికిరణం’. పాటల చిత్రీకరణను ఇజ్రాయిల్‌లో జరపనున్నారు. దర్శక-నిర్మాతలు  మాట్లాడుతూ- ‘‘యేసుక్రీస్తు జీవితంలో ఎవరూ చూపించని అంశాలను, కోణాలను మా చిత్రంలో చూపిస్తున్నాం.

సహజత్వం కోసం కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరించేందుకు జీసస్ పుట్టిన ఇజ్రాయిల్‌లోని జెరూసలేంతో పాటు ఈజిప్టు దేశాలకు వెళుతున్నాం. జూన్ లేదా జులై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటు న్నాం. ఆర్‌పీ పట్నాయక్  సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. అభినయ, మౌనిక, జెమిని సురేశ్ ముఖ్య తారలు.

 

Advertisement
 
Advertisement
Advertisement