అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్! | Then the Train Now tram .. !. | Sakshi
Sakshi News home page

అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్!

Jun 25 2015 12:01 AM | Updated on Sep 3 2017 4:18 AM

అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్!

అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్!

‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో ట్రైన్ ఎక్కడానికి కాజోల్ పరిగెడుతుంటే, ఆమెకు సహాయం చేయడానికి షారుక్ ఖాన్ చేయి అందించడం గుర్తుందా?

‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో ట్రైన్ ఎక్కడానికి కాజోల్ పరిగెడుతుంటే, ఆమెకు సహాయం చేయడానికి షారుక్ ఖాన్ చేయి అందించడం గుర్తుందా? ఆ సన్నివేశం భలే రసవత్తరంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆ తరహా సన్నివేశాలు చూశాం.
 
 కానీ, షారుక్-కాజోల్ వేసిన ముద్ర మాత్రం చెరిగిపోలేదు. మళ్లీ.. కాజోల్ అలా పరిగెత్తనున్నారు. షారుక్ చేయి ఇవ్వనున్నారు. ఆశ్చర్యంగా ఉందా? ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇద్దరూ కలిసి ‘దిల్‌వాలే’లో నటిస్తున్నారు.
 
 ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో మనసుని హత్తుకున్న ట్రైన్ సీన్‌లాంటిదే ఇందులో పెట్టాలని రోహిత్ శెట్టి అనుకుంటున్నారట. అయితే.. ఈ సీన్‌ని ట్రామ్‌లో తీయాలనుకుంటున్నారట. నాడు.. ట్రైన్ సీన్ మ్యాజిక్ చేసినట్లుగా.. రేపు ఈ ట్రామ్ సీన్ మ్యాజిక్ చేస్తుందా?.. వెయిట్ అండ్ సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement