ఆ మలుపు థ్రిల్‌కి గురి చేస్తుంది! | That in turn would be subjected to thrill! | Sakshi
Sakshi News home page

ఆ మలుపు థ్రిల్‌కి గురి చేస్తుంది!

Jun 29 2016 10:31 PM | Updated on Sep 4 2017 3:43 AM

ఆ మలుపు థ్రిల్‌కి గురి చేస్తుంది!

ఆ మలుపు థ్రిల్‌కి గురి చేస్తుంది!

‘‘ఒకప్పుడు ప్రేమలు పెళ్లికి దారితీసేవి. ఇప్పుడు ప్రేమ వల్ల జీవితాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి.

‘‘ఒకప్పుడు ప్రేమలు పెళ్లికి దారితీసేవి. ఇప్పుడు ప్రేమ వల్ల జీవితాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా ప్రేమకు ఆప్షన్లు పెరిగాయి. ఈ మీడియా ద్వారా లవ్‌లో పడిన ఓ నాలుగు పాత్రల చుట్టూ ‘రోజులు మారాయి’ తీశాం’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన కథ, స్క్రీన్-ప్లే అందించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. మారుతి మాట్లాడుతూ - ‘‘ఇవాళ చిన్న సినిమాలు థియేటర్లలో నిలబడటం లేదు.


అందుకే కొత్త నటీనటుల సినిమాలకు కథా బలం ఎక్కువగా ఉండాలి. ‘రోజులు మారాయి’కి మేము అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాం. నాలుగు పాత్రల చుట్టూ సరదాగా తిరిగే కథ చివర్లో ఒక ట్విస్టుతో థ్రిల్ కలిగిస్తుంది. ఎక్కువగా రొమాన్స్ చూపించలేదు. దర్శకుడు మురళీకృష్ణ తెరకెక్కించిన విధానం సంతృప్తిగా అనిపించింది’’ అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement