కలలో ఏం జరిగింది?

కలలో ఏం జరిగింది?


కలలో జరిగిందే నిజం అనుకునే వ్యక్తి చుట్టూ తిరిగే కథాంశమే ‘నాలో ఒకడు’. ప్రసాద్ రమర్ దర్శకత్వంలో సిద్ధార్ధ్ , దీపసన్నిధి జంటగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎనకుల్ ఒరువన్’. ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత  మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం తమిళంలో విడుదలై అన్ని చోట్లా మంచి టాక్ తెచ్చుకుంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం. మా సంస్థ నుంచి గతంలో వచ్చిన ‘పిశాచి’ చిత్రం కన్నా ఇది ఘన విజయం సాధిస్తుంది’’ అని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: ఎస్.వి.రావు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top