సైరా ఇంట్రెస్టింగ్ స్టిల్స్ పోస్ట్ చేసిన మెగాస్టార్ | Sye Raa Narasimha Reddy Movie Stills Viral On Social Media | Sakshi
Sakshi News home page

సైరా ఇంట్రెస్టింగ్ స్టిల్స్ పోస్ట్ చేసిన మెగాస్టార్

Mar 30 2018 10:18 AM | Updated on Mar 30 2018 12:56 PM

Sye Raa Narasimha Reddy Movie Stills Viral On Social Media - Sakshi

సైరా నరసింహారెడ్డి మూవీ ఫొటోలు

సాక్షి, సినిమా: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌ చేరుకున్న బిగ్‌ బి అమితాబ్ సైరా నరసింహారెడ్డి మూవీ స్టిల్స్‌ను తన ట్వీటర్‌, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. 'సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవితో పనిచయడం గౌరవంగా భావిస్తానని' అమితాబ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ ఇద్దరు మెగాస్టార్ల అభిమానులు సైరా మూవీ ఫొటోలు లైక్స్, షేర్లు చేస్తుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్న చిరంజీవి, నయనతారతో కలిసి యాగం నిర్వహిస్తున్న ఫొటోను అమితాబ్ పోస్ట్ చేశారు. అమితాబ్, బ్రహ్మాజీ, తదితరులు ఫొటోలో కనిపిస్తున్నారు. దాంతో పాటు మూవీలో తన స్టిల్ ఒకటి బిగ్ బి షేర్ చేయగా అభిమానుల నుంచి భారీగా స్పందన రావడం గమనార్హం. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.





 

రంగస్థలం మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement