సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’ | Suriya's Bandobast To Release on September 20th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

Aug 4 2019 1:59 PM | Updated on Aug 4 2019 1:59 PM

Suriya's Bandobast To Release on September 20th - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. తమిళంలో ‘కాప్పాన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు రంగం ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు నవాబ్, 2.0 చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య, సయేషాలు నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బందోబస్త్ తమిళ వెర్షన్ కాప్పాన్ పాటలు ఇటీవలే సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల అయ్యాయి. త్వరలో తెలుగు వెర్షన్ పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ గెటప్పుల్లో సూర్య నటన, పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, కథా నేపథ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా భారీగా జరుగుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు స‌న్ నెట్‌వ‌ర్క్‌ సంస్థ సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement