ఇరుముడి సక్సెస్.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ హీరో ఎవరంటే? | Irumudi Director Shiva nirvana next project with This Tollywood Hero | Sakshi
Sakshi News home page

Shiva Nirvana: ఇరుముడి సక్సెస్.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ఆ హీరోనేనా?

Oct 4 2026 8:25 AM | Updated on Oct 4 2026 8:58 AM

Irumudi Director Shiva nirvana next project with This Tollywood Hero

ఇరుముడి మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే తాజాగా టాలీవుడ్‌లో ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం హీరోను ఎంపిక చేశారని తెలుస్తోంది.  ఇటీవలే ది ప్యారడైజ్‌తో అలరించిన హీరో నానితో తన తదుపరి మూవీ చేయనున్నారని టాలీవుడ్ టాక్. ఇప్పటికే నాని కోసం ఒక ఎమోషనల్ కథను సిద్ధం చేశారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

గతంలో వీరిద్దరి కాంబోలో నిన్ను కోరి, టక్ జగదీశ్ చిత్రాలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ ఓకే ‍అయితే ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కనుంది. మరోవైపు నాని ది ప్యారడైజ్ తర్వాత బ్లడీ రోమియో మూవీలో నటించనున్నారు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే మరో ప్రాజెక్ట్ కోసం కూడా చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement