ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన సూపర్‌స్టార్స్‌ | Superstars of Mollywood Mammootty and Mohanlal surprise fans | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన సూపర్‌స్టార్స్‌

Jun 29 2017 8:06 PM | Updated on Sep 5 2017 2:46 PM

ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన సూపర్‌స్టార్స్‌

ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన సూపర్‌స్టార్స్‌

దాదాపు రెండు దశాబ్దాలుగా మలయాళ చలనచిత్ర పరిశ్రమను ఏలుతున్న సూపర్‌స్టార్స్‌ ఫ్యాన్స్‌ ని అనూహ్యంగా సర్‌ ప్రైజ్‌ చేశారు.

ముంబై:  దాదాపు రెండు దశాబ్దాలుగా మలయాళ చలనచిత్ర పరిశ్రమను ఏలుతున్న సూపర్‌స్టార్స్‌  ఫ్యాన్స్‌ ని అనూహ్యంగా సర్‌ ప్రైజ్‌  చేశారు.  మోహన్‌లాల్‌  మరో లెజెండ్‌ తో కలిసి ఉన్న  ఓ అరుదైన ఫోటోను సోషల్‌ మీడియాలో  అభిమానులతో పంచుకున్నారు.   మమ్ముట్టితో కలిసి ఉన్న ఫోటోను    తన ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు. అంతే ఈ ఫోటో వైరల్‌ అయింది.  రీల్‌ లైఫ్‌ లో ప్రత్యర్థులుగా వుండే వీరిద్దరు తమ రియల్‌  ఫ్రెండ్‌షిప్‌ను తమ అభిమానులతో పంచుకున్నారు.
మమ్ముట్టీ,  మోహన్ లాల్ ఇద్దరూ రీల్‌ లైఫ్‌లో ఢీ అంటే ఢీ అనుకునే క్యారెక్టర్లు  కానీ  ఇది రియల్‌ లైఫ్‌ లో  ప్రభావితం  చేయకుండా వృత్తి జీవితానికి భిన్నంగా తమ స్నేహాన్ని కాపాడుకుంటున్న వైనాన్ని  ప్రతిబింబించేలా ఉ‍న్న ఈఫోటో చూసి ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.
 కాగా వరుస హిట్స్ చిత్రాలతో  దూసుకుపోతున్న  మోహన్‌లాల్‌ లాల్‌జోస్‌ దర్శకత్వంలో 'వెళిపడింతె పుస్తకం' అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే  వెయ్యికోట్ల భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న  మహాహారతంలో  మోహన్‌ లాల్‌ భీమ పాత్రను పోషించనుండగా,  మాలీవుడ్‌, కోలివుడ్‌ అనే తేడాలేకుండా   బిజీబిజీగా ఉండే మమ్ముట్టి , తమిళ సూపర్‌స్టార్‌  రజనీకాంత్‌  చిత్రం  కాల కరికాలన్‌లో  ఓ  ప్రముఖ ప్రాతలో  నటిస్తున్నారనే  రుమార్లు  చెబుతున్నాయి.  తమ వైవిధ్యమైన నటనతో అశేషప్రేక్షకులను ఆకట్టుకున్న  మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ఇద్దరూ పృథ్విరాజ్, దుల్కర్ సల్మాన్, నివిన్ పాలిలీ, ఫహద్ ఫాసిల్, టోవినో థామస్  లాంటి   యంగ గన్స్‌కి పరిశ్రమలో  గొప్ప  స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారని పరిశ్రమ పెద్దల భావన.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement