నయన్‌ను అలా అంగీకరించడం లేదా? | Sakshi
Sakshi News home page

నయన్‌ను అలా అంగీకరించడం లేదా?

Published Tue, Apr 4 2017 1:15 AM

నయన్‌ను అలా అంగీకరించడం లేదా?

నయనతారను ప్రేక్షకులు అలా అంగీకరించలేకపోతున్నారా? కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ ఇదే. ‘సూపర్‌స్టార్‌’ కోలీవుడ్‌లో రజనీకాంత్‌కు మాత్రమే సొంతమైన పట్టం ఇది. దాన్ని మరొకరు టచ్‌ చేయాలని ఆశపడితే ఫలితం తీవ్రంగా ఉంటుందన్నది రుజువైంది. అలాంటిది ఆయన అభిమానిగా చెప్పుకునే నృత్య దర్శకుడు, నటుడు రాఘవలారెన్స్‌ తాను నటించిన మొట్టశివ కెట్టశివ చిత్రం టైటిల్‌లో మక్కల్‌ సూపర్‌స్టార్‌ అని వేయించుకున్నారు.

 దాన్ని దర్శకుడు సాయిరమణి తనపై అభిమానంతో అలా వేయించారని తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు మాత్రం అంగీకరించలేదు. చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న తమిళులకైనా రజనీకాంత్‌నే సూపర్‌స్టార్‌ అని ఆయన ప్రకటించక తప్పలేదు.

నయనతారకు అచ్చిరాని పట్టం: ఇకపోతే ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి నయనతార హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి కథతో మాయ చిత్రం విజయం సాధించడంతో నయనతారకు లేడీ సూపర్‌స్టార్‌ పట్టం కట్టారు. అయితే అలా తొలిసారిగా టైటిల్‌ కార్డులో వేయించిన చిత్రం డోర. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆశించిన రిజల్ట్‌ను అందుకోలేకపోయిందనే టాక్‌ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

 ఏక కాలంలో తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన డోర చిత్రం వసూళ్లను పెద్దగా రాబట్టలేకపోయిందనే టాక్‌ ట్రేడ్‌వర్గాల్లో వినిపిస్తోంది. విషయం ఏమిటంటే నయనతార తొలిసారిగా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకున్న చిత్రం ఇదే. ఏతావాతా లేడీ సూపర్‌స్టార్‌ పట్టం నయనతారకు అచ్చిరాలేదని తెలుస్తోంది. పట్టం అన్నది సినీ వర్గాలు ఇచ్చినా, దాన్ని అభిమానులు అంగీకరించాల్సిఉంటుందన్నది మరచిపోకూడదు. మరి తదుపరి చిత్రానికి నయనతార ఆ లేడీ సూపర్‌స్టార్‌ పట్టాన్ని వేసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement