సన్నీలియోన్కు ఎవరంటే ఇష్టం? | Sunny Leone finds Priyanka Chopra inspiring | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్కు ఎవరంటే ఇష్టం?

Jan 19 2015 6:15 PM | Updated on Sep 2 2017 7:55 PM

సన్నీలియోన్కు ఎవరంటే ఇష్టం?

సన్నీలియోన్కు ఎవరంటే ఇష్టం?

శృంగార తార సన్నీ లియోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఆమెకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?

శృంగార తార సన్నీ లియోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఆమెకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా? బాలీవుడ్లో తనకు ఎక్కువగా స్ఫూర్తినిచ్చేది ప్రియాంకా చోప్రా అని అమ్మడు వెల్లడించింది. తన భర్త డానియెల్ వెబర్తో కలిసి ఆమె ఓ పత్రిక కవర్ పేజీ ఆవిష్కరణకు వచ్చింది. అప్పుడే విలేకరులు ఆమెను హిందీ చిత్రరంగంలో ఏ నటి అంటే ఎక్కువ ఇష్టమని అడిగారు. నటన విషయానికొస్తే అందరికంటే విద్యాబాలన్, కంగనా రనౌత్ అంటే తనకు ఎక్కువ ఇష్టమని, అయితే.. అన్ని విషయాలూ తెలిసున్న ప్రియాంకా చోప్రా తనకు ఎక్కువ స్ఫూర్తినిస్తారని సన్నీ లియోన్ తెలిపింది.

ఇక్కడ నేరుగా ఆమె నటించేటప్పుడు చూస్తుంటానని, అదే అమెరికా వెళ్తే అక్కడ ఆమె హోర్డింగులు కూడా కనపడతాయని వివరించింది. అలాంటప్పుడు తనకు చాలా గర్వంగా అనిపిస్తుందని, తాను కూడా ఆమెతో పాటే హిందీ సినిమా రంగంలో నటిస్తున్నందుకు ఎంతో గొప్పగా అనిపిస్తుందని సన్నీ చెప్పింది. తుషార్ కపూర్, వీర్ దాస్ నటిస్తున్న మస్తీజాదేలో ప్రస్తుతం సన్నీ నటిస్తోంది.

Advertisement

పోల్

Advertisement