ఎంజీఆర్‌ టైటిల్‌తో శివకార్తికేయన్‌ | Siva Karthikeyan Using MGR Movie Title | Sakshi
Sakshi News home page

ఎంజీఆర్‌ టైటిల్‌తో శివకార్తికేయన్‌

Jun 21 2019 10:22 AM | Updated on Jun 21 2019 10:22 AM

Siva Karthikeyan Using MGR Movie Title - Sakshi

తమిళసినిమా: నటుడు శివకార్తికేయన్‌ చిత్రానికి ఎంజీఆర్‌ చిత్ర టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. శివకార్తికేయన్‌ ఇటీవల నటించిన మిస్టర్‌లోకల్‌ చిత్రం ఆయన్ని కాస్త నిరాశపరిచింది. అయితే నిర్మాతగా కనా, నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రాలు మూడు ఉన్నాయి. అందులో ఒకటి శివకార్తికేయన్‌ 16 పేరుతో నిర్మాణంలో ఉంది. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  నటి అనూఇమ్మానువేల్‌ నటిస్తోంది. కాగా నటి ఐశ్వర్యరాజేశ్, దర్శకుడు భారతీరాజా, సముద్రకని, సూరి,యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధిమారన్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నీరవ్‌షా ఛాయాగ్రహణం, డీ.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రానికి ఎంజీఆర్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్ర టైటిల్‌ ఎంగ వీట్టు పిళ్‌లైను నిర్ణయించినట్లు తెలిసింది. ఈ టైటిల్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్‌ వారికి చెందింది. కాగా ఆ సంస్థ శివకార్తికేయన్‌ చిత్రానికి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా శివకార్తికేయన్‌ ఈ చిత్రంతో పాటు ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్‌ చిత్రాన్ని, దర్శకుడు పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో హీరో అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే తాజాగా ఈ యువ హీరో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఆయన తమిళంలో సొంతంగా నిర్మించి, అతిథి పాత్రలో నటించిన కనా చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఇప్పుడు కన్నడం, తెలుగు భాషల్లోనూ రీమేక్‌ అవుతోంది. తమిళంలో కథానాయకిగా నటించిన నటి ఐశ్వర్యరాజేశ్‌నే తెలుగులోనూ నటిస్తుండగా, అతిథిపాత్రలో శివకార్తికేయనే నటిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement