మామియార్‌ వీట్టుక్కు... | Simbu to romance Megha Akash in Attarintiki Daredi remake | Sakshi
Sakshi News home page

మామియార్‌ వీట్టుక్కు...

Sep 18 2018 1:11 AM | Updated on Sep 18 2018 1:11 AM

Simbu to romance Megha Akash in Attarintiki Daredi remake - Sakshi

శింబు

అత్తను తీసుకురావడానికి మేనల్లుడు శింబు తన ప్రయత్నాలను మొదలెట్టేశారు. మరి అత్తను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఎలాంటి పథకాలను రచిస్తున్నాడు? అత్తారింటికి దారిని ఎలా కనుక్కున్నాడో తెలుగు సినిమా చూసినవాళ్లకు తెలుసు. తమిళంలో మామియార్‌ వీట్టుకు (అత్తారింటికి) అడ్రస్‌ ఎలా కనిపెడతాడో చూడాలి.

శింబు హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో తెలుగు హిట్‌ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేఘా ఆకాశ్‌ కథానాయిక. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జార్జియాలో ఆరంభమైంది. ఇందులో శింబుకు అత్తగా అప్పటి స్టార్‌ హీరోయిన్, దర్శకుడు సుందర్‌ భార్య ఖుష్బు యాక్ట్‌ చేయనున్నారట. చిత్రబృందం మాత్రం ఆ విషయంలో అప్‌డేట్‌ ఇవ్వలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement