సిద్ధు ఈజ్ బ్యాక్! | sidharth next movie with praveen satharu | Sakshi
Sakshi News home page

సిద్ధు ఈజ్ బ్యాక్!

Mar 22 2016 11:17 PM | Updated on Sep 3 2017 8:20 PM

సిద్ధు ఈజ్ బ్యాక్!

సిద్ధు ఈజ్ బ్యాక్!

వస్తుతః తమిళుడైనా, అక్కడి కన్నా తెలుగులో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో - సిద్ధార్థ్.

వస్తుతః తమిళుడైనా, అక్కడి కన్నా తెలుగులో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో - సిద్ధార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా నేరు తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు. తాజాగా ఇప్పుడు ఆయన ఒక నేరు తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధమైనట్లు కృష్ణానగర్ కబురు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గతంలో జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘చందమామ కథలు’, ఇటీవలే అధోజగత్తుకు చెందిన ఇద్దరు దొంగల జీవితాలపై తీసిన కామెడీ-థ్రిల్లర్ ‘గుంటూర్ టాకీస్’ ద్వారా పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్.

ఆయన తన తాజా ప్రయత్నానికి సిద్ధార్థ్‌ను కథానాయకుడిగా ఎంచుకొన్నారట! బహిర్గతం చేయకుండా మనం మనసులోనే దాచుకొనే ఆలోచనలు, అంతరంగ భావోద్వేగాలను నగ్నంగా ఆవిష్కరించే ఒక సున్నితమైన ప్రేమకథగా ఈ చిత్రకథను అల్లుకుంటున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్! ఇప్పటికే ఈ స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసిన దర్శకుడు ఏప్రిల్ ఆఖరు కల్లా షూటింగ్ మొదలుపెట్టేస్తారట! మొత్తానికి, సిద్ధార్థ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇది షురూ అన్న మాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement