క్షేమంగానే ఉన్నాను

Sickness Actor Krishnam Raju - Sakshi

సీనియర్‌ నటులు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారని బుధవారం వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని, క్షేమంగానే ఉన్నానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నిమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్‌ చెకప్‌ కోసమని హాస్పిటల్‌కు వెళ్లాను. దాంతో అనారోగ్యం పాలయ్యానని వార్తలు బయటకు వచ్చాయి. దానివల్ల హాస్పిటల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శకు సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బావుంది. చెకప్‌ పూర్తవగానే ఇంటికి వెళ్లిపోతాను. నా ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురైన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణంరాజు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top