‘పెళ్లి.. అవుట్‌డేటెడ్‌ కాన్సెప్ట్‌’ | ShubhalekhaLu New Teaser Dont Marry Be Happy | Sakshi
Sakshi News home page

Jul 17 2018 3:26 PM | Updated on Jul 17 2018 3:29 PM

ShubhalekhaLu New Teaser Dont Marry Be Happy - Sakshi

కొత్త టేకింగ్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు ఘనవిజయాలు సాదిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమాని, దీక్షా శర్మ ప్రధాన పాత్రల్లో శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకుడు. ఇప్పటికే ఇంట్రస్టింగ్ టీజర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ మరో డిఫరెంట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఇప్పటికే ప్రధాన పాత్రదారులను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్‌లకు సూపర్బ్‌ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అదే బాటలో మరో టీజర్‌ను రిలీజ్ చేశారు. పెళ్లి గురించి ఓ మోడ్రన్‌ అమ్మాయి అభిప్రాయాన్ని టీజర్‌ రూపంలో రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ లు నిర్మిస్తుండగా కే ఎమ్‌ రాథాకృష్ణన్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement