హైదరాబాద్‌లో ‘సాహో’ హీరోయిన్‌

Shraddha Kapoor Joins In Saaho Shooting Scheduled At Hyderabad - Sakshi

బాహుబలి తరువాత ప్రభాస్‌ ఇండియన్ హీరోగా ఎదిగాడు. తన తరువాతి సినిమా సాహోను భారీ బడ్టెట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె దుబాయ్‌లో భారీ షెడ్యుల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యుల్‌లో యాక్షన్‌, ఛేజింగ్‌ సీన్స్‌ను చిత్రీకరించారు. తాజాగా మరో షెడ్యుల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేశారు. 

ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోన్న శ్రద్ధా కపూర్‌ తాజా షెడ్యుల్‌లో పాల్గొన్నారు.  హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాల్ని షూట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top