మరో వారంలో ఎంట్రీ! | Shiva Rajkumar plays an extended cameo in Gautamiputra Satakarni | Sakshi
Sakshi News home page

మరో వారంలో ఎంట్రీ!

Nov 1 2016 11:22 PM | Updated on Aug 29 2018 1:59 PM

మరో వారంలో ఎంట్రీ! - Sakshi

మరో వారంలో ఎంట్రీ!

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కన్నడ రాజ్‌కుమార్ తన యుడు, ప్రముఖ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్నారనే

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కన్నడ రాజ్‌కుమార్ తన యుడు, ప్రముఖ హీరో శివ రాజ్‌కుమార్ నటిస్తున్నారనే వార్తను నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయి బాబా అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, ఏ పాత్రలో అనేది వెల్లడించలేదు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి వరకూ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నడ మినహా ఇతర భాషల్లో నటించలేదు.

మా చిత్రంలో నటించడానికి అంగీకరించిన శివరాజ్‌కుమార్‌కి థ్యాంక్స్. వచ్చే వారం నుంచి ఆయన నటించే సీన్స్ చిత్రీకరించనున్నాం. జనవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement