ఎలా ఫీలవుతున్నారు?.. హీరో అసహనం | Shahid Kapoor Fires On Journalist For Asking Stupid Questions | Sakshi
Sakshi News home page

May 17 2018 4:30 PM | Updated on May 17 2018 5:43 PM

Shahid Kapoor Fires On Journalist For Asking Stupid Questions - Sakshi

ఐఫా ప్రెస్‌ మీట్‌లో షాహిద్‌

ముంబై : బాలీవుడ్‌ హీరో షాహీద్‌ కపూర్‌కు చిర్రెత్తుకొచ్చింది.  షాహీద్‌ కపూర్‌-మీరా రాజ్‌పుత్‌ల జంటకు ఇది వరకే ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. షాహీద్‌ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. దీంతో ఎలా ఫీలవుతున్నారంటూ? ఐఫా ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్న షాహిద్‌ను జర్నలిస్టులు పదే పదే ప్రశ్నించగా.. అసహనానికి గురయ్యారు. ‘సంతోషంగా ఉంది.. రెండోసారి గనుక కొత్తగా ఫీలవ్వడానికి ఏమీ లేదు. కాకపోతే కుటుంబం అంతా బిడ్డ కోసం ఎదురు చూస్తోంది’ అని షాహీద్‌ బదులిచ్చారు.

ఆ వెంటనే మరో జర్నలిస్టు.. ‘తమ కుటుంబానికి సమయం కేటాయించలేని వారికి మీరేమైనా సలహా ఇస్తారా? అని  అడగ్గా షాహీద్‌ సెటైరిక్‌ సమాధానం ఇచ్చారు. ‘నువ్వైతే వారికి ఏం సలహా ఇస్తావ్‌? నీకు పెళ్లైందా? నువ్వు తండ్రివా? అంటూ ఆ జర్నలిస్ట్‌ను ప్రశ్నించగా.. పెళ్లైంది కానీ పిల్లలు లేరు అని సదరు జర్నలిస్టు సమాధానమిచ్చాడు. అయితే పిల్లలు పుట్టాక తెలుస్తుందిలే అని షాహిద్‌ సెటైర్‌ పేల్చారు. పదే పదే ఆ అంశంపైనే ప్రశ్నలు అడుగుతుండటంతో ‘ఇది ఐఫా ప్రెస్‌ మీట్‌’ అంటూ షాహిద్‌ అసహనంగా సమాధానం ఇవ్వటంతో అక్కడంతా నవ్వులు పూశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement