
పదేళ్లకో ట్రెండ్ సెట్టర్ వస్తుంది!
‘‘ఇటీవల నేను చేసిన పాత్రల్లో ‘అ..ఆ’ చిత్రంలోని రామలింగం పాత్ర ది బెస్ట్. ‘గుంటూరు టాకీస్’లోని పాత్ర మాస్‌కి దగ్గర చేస్తే, రామలింగం క్యారెక్టర్ క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది’’
‘‘ఇటీవల నేను చేసిన పాత్రల్లో ‘అ..ఆ’ చిత్రంలోని రామలింగం పాత్ర ది బెస్ట్. ‘గుంటూరు టాకీస్’లోని పాత్ర మాస్‌కి దగ్గర చేస్తే, రామలింగం క్యారెక్టర్ క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది’’ అని నటుడు సీనియర్ నరేశ్ అన్నారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ - ‘‘ప్రతి పదేళ్లకోసారి ట్రెండ్ సెట్ చేసే మూవీ వస్తుంటుంది. ‘అ..ఆ’ అటువంటి కోవలోకి వస్తుంది.
ప్రస్తుతం రావు రమేశ్, నేను ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇప్పటి తరం దర్శకులతో పనిచేయడం వల్ల ప్రస్తుత ట్రెండ్ తెలుస్తోంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడే ప్రతి సినిమా పెద్దదే. కృష్ణగారి స్వర్ణోత్సవ చిత్రం ‘శ్రీశ్రీ’లో, మహేశ్‌తో ‘బ్రహ్మోత్సవం’లో చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం నాలుగు చిత్రాలు కమిట్ అయ్యా’’ అన్నారు.