
కత్రినా కైఫ్
...అని అంటున్నారు లేడీ టైగర్ కత్రినా కైఫ్. ఇప్పుడెందుకు ఆమె గాల్లో తేలిపోతున్నారు అంటే.. ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ కోసం అట. ఈ సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కోసం కత్రినా కైఫ్ గాల్లో ఎగిరే స్టెప్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారట. అందుకని ‘గాల్లో తేలిపోతున్నాను’ అని పేర్కొన్నారు కత్రినా. అలాగే తనకు తోడుగా ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్‌ను కుడా జాయిన్ చేసుకున్నారు కైఫ్. కత్రినాతో పాటు ఆమిర్, ఫాతిమా కూడా ఈ పాటకు కాలు కదపబోతున్నారట. స్టెప్స్ అంత ఈజీ కాదు.
అందుకే ఆమిర్, కత్రినా, ఫాతిమా చాలా రోజులగా ప్రాక్టీస్ చేస్తున్నారట. ఈ సాంగ్‌ను త్వరలో షూట్ చేస్తారని సమాచారం. ఇదివరకు కత్రినా చేసిన ‘చిక్నీ చమేలీ, కమిలీ కమిలీ’ సాంగ్ రేంజ్‌లోనే ఈ సాంగ్ కూడా ఉంటుందని ‘థగ్స్..’ చిత్రబృందం పేర్కొంటున్నారు.‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ నవల ఆధారంగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వైఆర్‌ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కత్రినా కైఫ్, ‘దంగల్’ భామ ఫాతిమా సన షేక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.